AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 16/ అక్షరం న్యూస్/ --- గురుదేవ్ విద్యాలయం నందు ఎనిమిదో తరగతి చదువుతున్న సిహెచ్ అన్విత నేడు భద్రాచలం నందు నిర్వహించిన జోనల్ స్థాయి ఖో ఖో క్రీడల నందు చక్కటి ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైంది. జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన అన్విత ను మండల విద్యాశాఖ అధికారి పివి రమణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరి అకాడమిక్ కోఆర్డినేటర్స్ సుబ్రమణ్యం శ్రీనివాస్ లు అభినందనలు తెలియజేశారు. అన్విత ఇంతటి ఘనకార్యం సాధించడానికి కారణమైన వ్యాయామ ఉపాధ్యాయులు బుజ్జి బాబు లావణ్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. అన్విత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పలువురు అభినందనలు తెలిపారు.
.
Aksharam Telugu Daily