GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్/హుజురాబాద్/జనవరి 19/అక్షరం న్యూస్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రిక అక్షరం దినపత్రిక అని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున అక్షరం దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో అక్షరం పత్రిక ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షరం దినపత్రిక హుజురాబాద్ ఆర్ సి. సౌడమల్ల యోహాన్, తెలంగాణ జన సమితి (టీజేఎఫ్) రాష్ట్ర నాయకురాలు అరికిల స్రవంతి భానుచందర్, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ,ఎండి కాజా ఖాన్, నాయకులు కందుకూరి రాజు, రచ్చ రవి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily