D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వారిరువురికి ఘన సన్మానం.. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ జూలై 27 ( అక్షరంన్యూస్) / ఖమ్మం రూరల్: జర్నలిస్టుల హక్కుల సాధనకై టీయూడబ్ల్యూజే(ఐజేయు) సంఘాన్ని మరింత బలోపేతం చేసుకుందామని ఆ సంఘం జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు,మైసా పాపారావు అన్నారు. ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు లో గల సిపిఐ కార్యాలయంలో వారిరువుకి టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. తొలుత జర్నలిస్టులు బొకేలు, సెలవులతో సత్కరించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమి జర్నలిస్ట్ పెరుమల్లపల్లి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వారు మాట్లాడారు... ఐ జే యు యూనియన్ కి ఖమ్మం రూరల్ మండలం ఎంతో బలమైన కేంద్రంగా పేర్కొన్నారు. ఈ బలంతో మరింత బలంగా యూనియన్ విస్తరణకు కృషి చేయాలని సంఘం జర్నలిస్టులకు తెలిపారు. జిల్లా కమిటీ నుంచి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. తమను ఆహ్వానించి సన్మానం చేసిన ఖమ్మం రూరల్ మండల కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎన్. రంగారావు( మన తెలంగాణ), బి. అశోక్ ( ప్రజాపక్షం), ఎం. లక్ష్మణ్( నమస్తే తెలంగాణ), కె .రఘురాం( విశాలాంధ్ర), స్వరూప్ (సూర్య ), సురేష్ (పోలీస్ నిఘా),బి. కృష్ణ( విశాలాంధ్ర), బి. రాధాకృష్ణ( ఫాస్ట్ న్యూస్) పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily