D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ నవంబర్ 20 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ 1వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం – రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కార్యక్రమాన్ని వైరా మున్సిపల్ చైర్మన్ కాపా చంద్రకళ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ స్థానిక కౌన్సిలర్ మోరు శ్రీకాంత్ సమక్షంలో ప్రారంభించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కుటుంబానికి జీవనాధారంగా ఉంటూ సంపాదించే వ్యక్తికి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే,ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలిపారు,పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా ఉంటుందని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మోరు శ్రీకాంత్ దగ్గరుండి వార్డు ప్రజలకు పథకం గురించి వివరించి,అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మేడురీ రామచంద్ర రావు, మున్సిపల్ మేనేజర్ సుధీర్ మున్సిపల్ సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు,
.
Aksharam Telugu Daily