D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ వైరా అక్టోబర్ 27 (అక్షరం న్యూస్) ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రానైట్ రాయితో వెళుతున్న లారీ నీ ఢీకొట్టిన మరో లారి. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 03:30 గంటలకు, వైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరపల్లి మార్గంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై లక్ష్మీపురం బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి కాకినాడ వైపు గ్రానైట్ రాళ్లను తీసుకువెళ్తున్న TS 02 UB 8906 వాహనం, అదే దిశలో కల్లూరు వైపు వెళ్తున్న KA 56 9236 వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా గ్రానైట్ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో, వాహన డ్రైవర్ షేక్ అనికుల్ క్యాబిన్లో ఇరుక్కొని మృతి చెందాడు. లారీ డ్రైవర్ దుర్మరణం. కరీంనగర్ నుంచి కాకినాడకు భారీ గ్రానైట్ రాయితో వెళుతున్న లారీ బోల్తా పడి ట్రాఫిక్ స్తంభించింది. వైరా ఎస్సై రామారావు పోలీస్ సిబ్బంది సంఘటన స్థలంలో ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. సోమవారం ఎగ్జిట్ నాలుగు వద్ద దేవరపల్లి వైపు వెళ్లే వాహనాలను వైరా నుంచి జాతీయ ప్రధాన రహదారి మీదుగా దారి మళ్లించిన పోలీసులు. సోమవరం టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ను మళ్లించారు. గ్రానైట్ రాళ్లను తొలగించి, క్యాబిన్లో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
.
Aksharam Telugu Daily