AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల/ పెద్దపల్లి మే10 (అక్షరం న్యూస్ ) పెద్దపల్లి పట్టణంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి పట్టణ మరియు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన 98 మంది విద్యార్థిని విద్యార్థులకు, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థినీ విద్యార్థులను శాలువాలతో సన్మానించి, మెమొంటోలు బహూకరించి వారందరినీ అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే..చింతకుంట విజయరమణ రావు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొంకూరి అవినాష్, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల విద్యాధికారి మరియు పలు గ్రామాల సర్పంచ్లు మరియు పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily