DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 13 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 36 వార్డులకు గానూ 27 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంతో మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ కౌన్సిల్ ఏర్పాటు దాదాపు ఖరారైంది. విపక్షాలకు ఈ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. భారత రాష్ట్ర సమితి ఒక్క స్థానానికే పరిమితమవ్వగా, భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క వార్డులో గెలుపొందింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5 వార్డులు దక్కించుకోగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వార్డు వారీగా గెలుపొందిన కౌన్సిలర్లు 01వ వార్డు – పూరెల్ల శైలజ (కాంగ్రెస్) 02వ వార్డు – పాస్తం లక్ష్మి (కాంగ్రెస్) 03వ వార్డు – ములుగురి కమల్ (కాంగ్రెస్) 04వ వార్డు – కొమ్ము సుధాకర్ (కాంగ్రెస్) 05వ వార్డు – గుజ్జులా కుమార్ (కాంగ్రెస్) 06వ వార్డు – వెన్నం సుజాత (బీఆర్ఎస్) 07వ వార్డు – ఈర్ల స్వరూప (కాంగ్రెస్) 08వ వార్డు – ఫర్జానా నాజ్ (స్వతంత్ర) 09వ వార్డు – నాదిం (కాంగ్రెస్) 10వ వార్డు – అక్కపెల్లి సుజాత (కాంగ్రెస్) 11వ వార్డు – పురి అనూష (కాంగ్రెస్) 12వ వార్డు – బొడ్డుపల్లి జగదీష్ (కాంగ్రెస్) 13వ వార్డు – పాగల శ్రీకాంత్ (కాంగ్రెస్) 14వ వార్డు – అస్లాం పర్వేజ్ (కాంగ్రెస్) 15వ వార్డు – పెంజర్ల రాకేష్ (బీజేపీ) 16వ వార్డు – నందిని శ్రీనివాస్ (కాంగ్రెస్) 17వ వార్డు – తోట ఫణీంద్ర (కాంగ్రెస్) 18వ వార్డు – కలిపాక సంపత్ (ఫార్వర్డ్ బ్లాక్) 19వ వార్డు – రెవెల్లి స్వామి (కాంగ్రెస్) 20వ వార్డు – గణపతి నిర్మల (ఫార్వర్డ్ బ్లాక్) 21వ వార్డు – ముగిళ్ళ మల్లయ్య (కాంగ్రెస్) 22వ వార్డు – ఉప్పు స్వరూప (కాంగ్రెస్) 23వ వార్డు – జడల సురేందర్ (ఫార్వర్డ్ బ్లాక్) 24వ వార్డు – కొట్టే స్వరూప (కాంగ్రెస్) 25వ వార్డు – శాహానజ్ బేగం (స్వతంత్ర) 26వ వార్డు – సుదమల్ల అమ్రేష్ (కాంగ్రెస్) 27వ వార్డు – ఉనుకొండ సరస్వతి (కాంగ్రెస్) 28వ వార్డు – తూముల లత (కాంగ్రెస్) 29వ వార్డు – ఇల్లందుల రజని (కాంగ్రెస్) 30వ వార్డు – ముక్సుదా బేగం (ఫార్వర్డ్ బ్లాక్) 31వ వార్డు – మంథని నర్సింగ్ (కాంగ్రెస్) 32వ వార్డు – తిర్రీ శ్రీలత (కాంగ్రెస్) 33వ వార్డు – గంగుల సంధ్యారాణి (ఫార్వర్డ్ బ్లాక్) 34వ వార్డు – ఆశ్రఫ్ (కాంగ్రెస్) 35వ వార్డు – దేవానంది రమాదేవి (కాంగ్రెస్) 36వ వార్డు – మాస్కాన్ సత్ (కాంగ్రెస్) ఫలితాల సారాంశం మొత్తం వార్డులు : 36 కాంగ్రెస్ : 27 బీఆర్ఎస్ : 1 బీజేపీ : 1 ఫార్వర్డ్ బ్లాక్ : 5 స్వతంత్రులు : 2 కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు వెల్లివిరిశాయి. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని గెలుపొందిన కౌన్సిలర్లు పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily