GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా / రఘునాథపల్లి/( అక్షరం న్యూస్ ) అక్టోబర్ 03 : విజయదశమి పండుగను పురస్కరించుకొని, మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమానికి జనగామ రూరల్ సిఐ ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి హాజరై దుర్గామాత అమ్మవారి పూజతో పాటు,ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు.అనంతరం పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బందికి శమీ పత్రాలను అంద జేసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారుఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కట్టుమల్లు,ఎస్ఐ కట్టుమల్లు హెడ్ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్,నరసయ్య, పోలీస్ కానిస్టేబుళ్లు యుగంధర్, భాస్కర్, నరేష్, సురేషు, అనిల్, రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily