Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జూన్ 12 (అక్షరంన్యూస్) గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ వద్ద గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురి కావడం పట్ల బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టేకాఫ్ సమయంలో విమానాశ్రయానికి సమీపాన ఉన్న మెడికల్ కాలేజీ భవనం పైన అది కూలడంతో పలువురు ప్రయాణీకులు, మెడికల్ విద్యార్థులు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని నామ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నామ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రాన్ని, గుజరాత్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యానివ్వాలని నామ భగవంతున్ని ప్రార్థించారు.
.
Aksharam Telugu Daily