D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 9/ వైరా (అక్షరంన్యూస్) సామాన్య తెలంగాణ ప్రజల గురించి కవిత్వం రాసిన వాడు కాలోజీ నారాయణ రావు గొప్ప వ్యక్తిని, స్థానిక వైరా పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ వి. వీరస్వామి తెలిపారు. కాలోజి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని , మంగళవారం కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ , కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలతో అలంకరించి పూలతో గౌరవించడం జరిగింది. ఈ సందర్భంగా కాళోజి నారాయణరావు గొప్పతనాన్ని కవిత్వాన్ని ,విద్యార్థులకు వివరించడం జరిగింది. కాళోజి నారాయణరావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామ్ అని తెలియజేస్తూ, ప్రజలందరూ కాలోజీ నారాయణరావుగా పిలవడం జరిగింది అని తెలుపుతూ, ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వానికి , దేశ్ముఖ్, భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా ప్రజల్ని మేల్కొల్పడం జరిగిందని తెలియజేశారు . శాసన మండలి సభ్యుడుగా, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు . తెలంగాణ ప్రభుత్వం వరంగల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరుతో కాళోజి హెల్త్ యూనివర్సిటీగా గౌరవించడం జరిగింది అని తెలిపారు. ఆయన పేరుతో ప్రతి సంవత్సరం కాళోజీ సాహిత్య పుష్కర అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు .1992లో దేశ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ అవార్డు పొందినట్లు తెలిపారు. విద్యార్థులందరూ కూడా కాళోజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు, కాళోజి జీవిత చరిత్ర గురించి మాట్లాడటం జరిగిందన్నారు.
.
Aksharam Telugu Daily