D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *, * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ /మార్చి 13 (అక్షరంన్యూస్)* రవాణా శాఖ కార్యాలయంలో అవినీతికి అంతులేకుండా పోయింది. ఇనుప చీపిరితో అందినంతవరకు ఊడ్చేస్తున్నారు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి.. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వాహనాలను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఏ పనైనా నిమిషాల్లో చేపిస్తామంటూ ఏజెంట్లు వాహన యజమానులను దోచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో అనుమతి లేని వాహనాలకు ఇక్కడ అనుమతులు లభిస్తున్నాయి.. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి పనులు చేస్తున్నారు. చాలాన్ కడితే కావలసిన పనులు కావడం లేదు, సంప్రదిస్తేనే పనులు జరుగుతున్నాయి. దళారి ఇన్షల్ వేస్తేనే అధికారులు ఫైల్ మూవ్ చేస్తారు లేదంటే, రేపు రా మారా అంటూ ఏదో వంకతో నెలల తరబడి తిప్పుతూనే ఉంటారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, అయోమయంలో వాహన యజమానులు, హెవీ వెహికల్స్ లో పరిమితికి మించి లోడు లోను నెల నెల మామూలు వసూలు చేస్తున్నారు, అనే ఆరోపణలు వస్తున్నాయి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనానికి వంద రూపాయలు, నాలుగు చక్రాల వాహనానికి రూ 500, హెవీ లైసెన్స్ వెయ్యి రూపాయలు, టాక్సీ ప్లేట్, ఆటో రిక్షా, ట్రాక్టర్ ఇంజన్, ట్రక్కు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర చెల్లించాల్సిందే, రైతులకు సంబంధించి పొలం కలిగిన ఉంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి కానీ నిబంధనలు ఏవిపరవర్తించడం లేదు ఇస్తాను సారంగా వస్తుంది. ప్రతి పనికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చెల్లించాలి అనుమతి లేనివాళ్లు ఇక్కడ 10000 చెల్లిస్తే వెంటనే అనుమతి ఇస్తారు. రెండు అధికారాలు నిర్వహిస్తున్న ఓ అధికారి ఆదాయం చూస్తే మతిపోవాల్సిందే, వెహికల్స్ కు అనుమతులు ఇస్తున్నారు, బొడుపులు చెల్లిస్తే ఏ పనైనా నిమిషాలలోనే, ఇది ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం పరిస్థితి, ఇకనైనా అధికారులు, మంత్రులు స్పందించి అవినీతి అధికారుల పై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily