AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపాడు; అక్షరం న్యూస్/ సెప్టెంబర్ 9: తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందించడానికి మండల్ లెవెల్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంటింటికి తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారి పేర్లు నమోదు చేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం నాడు బూర్గంపాడు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో ఆది కర్మయోగి అభియాన్ పథకం ప్రతిస్పందననాత్మక పాలనా కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది కర్మయోగి అభియాన్ పథకం సంబంధించిన కార్యక్రమాలు మండలంలోని నకిరిపేట, ఉప్పుసాక, కృష్ణ సాగర్ గ్రామాలలోని గిరిజనులకు మండల్ లెవెల్ కమిటీ సభ్యులు ముందుగా గిరిజన గ్రామాలకు సందర్శించినప్పుడు గ్రామములో గ్రామ సభ ఏర్పాటుచేసి పథకాలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రత్యేకంగా ఒక బోర్డుపై వ్రాయించి, ప్రజలకు ముందుగా వారికి అర్థమయ్యే రీతిలో బోధన, ప్రజలు ఆలోచించేలా ప్రోత్సహించాలని అన్నారు.గిరిజన గ్రామాలలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారము తప్పనిసరిగా మండల్ లెవెల్ కమిటీ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు గురించి అవగాహన కల్పించి వారు తీసుకునేలా చూడాలని అన్నారు. ఆయా గ్రామంలలో ఒక్కొక్క శాఖకు ఎన్జీవో సాథిలను నియమించుకొని వారి ద్వారా గిరిజన ప్రజలకు అర్థమయ్యేలా వారి భాషలోనే తెలియజేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి గ్రామస్తులు చర్చించుకొని పథకాలు లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. అర్హులైన గిరిజనులకు పథకాలతో పాటు మరియు గ్రామంలోని సమస్యలు తెలుసుకొని ఆయా గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొవాలని అన్నారు. ముఖ్యంగా విద్యా, వైద్యం, అంగన్వాడి సెంటర్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా విడుదలయ్యే పథకాలతో పాటు గిరిజన గ్రామాలలో అనేక రకాల వనరులు అందుబాటులో ఉన్నాయని, ఆ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు వారి దరికి చేరేలా చూడాలని, గ్రామాలలో ఉత్సాహవంతులైన యూత్ మరియు పెద్దలకు క్లుప్తంగా తెలియజేస్తే గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ పథకాల గురించే చర్చించుకొని లబ్ధి పొందుతారని, మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం మండల్ లెవెల్ కమిటీలు బాధ్యతతో ముందుకు తీసుకొని పోయేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మరియు ఆది కర్మయోగి అభియాన్ పథకం మండల నోడల్ అధికారి జమాల్ రెడ్డి, నాగరాజు హెచ్ డబ్ల్యు ఓ, బి. రవి హెచ్ఈవో, ఉషారాణి హెచ్ఎం, రాంబాబు సిసి, జగదాంబ ఐసిడిఎస్ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily