Jakkani Rajaramesh , SIRCILLA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /!మార్చి -28(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండల కేంద్రం లోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను, స్కానింగ్ సెంటర్లను రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రు లలో రికార్డులను, స్కానింగ్ సెంటర్ల మెషిన్లను పరిశీలించారు . ఫారం ఎఫ్ ఆడిట్లను పరిశీలించి గర్భిణీ స్త్రీ యొక్క వివరాలు సంతకాలు తీసుకొని, గర్భిణీ స్త్రీ స్కానింగ్ వివరాల ఫిలింను జత పరచాలని సూచించారు , నిబంధనలకు విరుద్ధంగా గర్భిణీ స్త్రీ కి ఆడ మగ (లింగ నిర్ధారణ) అని సైగల ద్వారా తెలియజేసిన వారి స్కానింగ్ సెంటర్ లను సీజ్ చేస్తామని, రూ.10,000 వేల రూపాయల జరిమానా విధిస్తూ, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని స్కానింగ్ నిర్వాహకులకు సూచించారు , రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ఆస్పత్రులను నిర్వహించినట్లయితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . వీరితో మహేష్ గౌడ్, నవీన లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily