DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి | డిసెంబర్ 12 | అక్షరం న్యూస్ : నిత్యం నూతనమైన, ప్రజలకు ఉపయోగపడే వార్త కథనాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడంలో అక్షరం దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రతిబింబిస్తూ, పాలనకు – ప్రజలకు మధ్య విశ్వసనీయ సమాచార వేదికగా అక్షరం దినపత్రిక నిలుస్తోందని ఆయన అభినందించారు. సోమవారం అక్షరం దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్‌ను అదనపు కలెక్టర్ డి. వేణు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్రికలు కేవలం వార్తలకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే సాధనాలుగా పనిచేయాలని అన్నారు. ఆ దిశగా అక్షరం దినపత్రిక నిరంతరం బాధ్యతాయుత పాత్రను నిర్వహిస్తోందని ప్రశంసించారు. ప్రజాసమస్యలపై అక్షరం దినపత్రిక ప్రచురించే కథనాలు పాలన వ్యవస్థ దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఉండటమే కాకుండా, సమస్యల పరిష్కార దిశగా చర్చకు దారితీస్తున్నాయని అదనపు కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి సామాజిక బాధ్యతను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అక్షరం ప్రతినిధి దొమ్మటి రాజేష్, సీనియర్ పాత్రికేయులు సోమకుమార్, పని సుదర్శన్, నూనె శ్రీనివాస్తో పాటు పలువురు పాత్రికేయులు, అక్షరం దినపత్రిక సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం అక్షరం దినపత్రికకు మరింత ప్రోత్సాహం, గౌరవంగా నిలిచిందని వారు తెలిపారు. సత్యం, సామాజిక బాధ్యత అనే విలువలతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న అక్షరం దినపత్రిక ప్రజా చైతన్యానికి దీపస్తంభంగా నిలుస్తోందని కార్యక్రమంలో పాల్గొన్నవారు.
.
Aksharam Telugu Daily