AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/కొత్తగూడెం/ అక్టోబర్ 09/ అక్షరం న్యూస్; హెచ్ఐవి తో బాధపడే వారు రోగులు కాదు, మన సమాజంలోని మనవాళ్లు అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్ జయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ హెచ్ఐవితో బాధపడే బాధితులకు వివక్ష లేకుండా, గౌరవప్రదంగా, సానుభూతితో వైద్య సేవలు అందించాలని, హెచ్ఐవి ఒక వైద్య పరిస్థితి మాత్రమే నని దానిని ఎదుర్కొనే వ్యక్తికి సమాజం చూపించే వివక్ష, నిర్లక్ష్యం, మరియు అపోహలు చాలా పెద్ద సమస్యగా మారాయని , హెచ్. ఐ. వి సోకిన వ్యక్తి మన ఆసుపత్రికి వచ్చినప్పుడు, ఆయన/ఆమెకు భయం, సంకోచం, అపహాస్యం లాంటి భావాలు ఉంటాయనీ, అలాంటి సమయంలో మన వైద్య బృందం చూపే ఆత్మీయత, అర్ధం చేసుకోవడం, మరియు సమానమైన వైఖరి అదే ఆ వ్యక్తికి ఆశ నింపగలదని ఈ విషయాలను వైద్యులు, సిబ్బంది గుర్తుంచుకోవాలనీ, మన చేతులు చికిత్స చేయడానికి మాత్రమే కాక, నమ్మకం నింపడానికి కూడా ఉన్నాయనీ, హెచ్ఐవి పాజిటివ్ రోగికి ఇతరుల మాదిరిగానే మనస్ఫూర్తిగా సేవ చేయడం మన నైతిక బాధ్యత అని డీఎం.హెచ్.ఓ సూచించారు. ఒక చిన్న వివక్షతకు కూడా రోగి గురికాకుండా చూడాలని, హెచ్ఐవి సోకిన వ్యక్తి ముందు వేరే బెడ్ ఇవ్వడం, చేతి గ్లౌజులు అవసరానికి మించి వాడటం, లేదా మాట్లాడేటప్పుడు భయపడటం, రోగిపై లోతైన మానసిక ప్రభావం చూపుతుందనీ, హెచ్ఐవి వ్యాప్తి మార్గాలు స్పష్టంగా తెలుసుకోవాలనీ, స్పర్శ ద్వారా, ఆహారం పంచుకోవడం ద్వారా, లేదా సాధారణ రోజువారీ సంపర్కం ద్వారా ఇది వ్యాపించదనీ, రోగి యొక్క (గోప్యత) కాపాడటం అత్యంత ముఖ్యమైందనీ, రోగి వివరాలను గౌరవంగా, అవసరమైన చోట మాత్రమే పంచుకోవాలనీ , రోగి కి మనం ఇచ్చే సానుభూతి మరియు గౌరవం ఇవే నిజమైన ఔషధాలనీ సూచించారు.హెచ్. ఐ. వి సోకిన వారు రోగులు కాదు, మన సమాజంలోని మనవాళ్లు ...వారిని భయంతో కాక, ప్రేమతో చూడాలని, వారికి సానుభూతితో సేవ అందించాలని, అప్పుడు మాత్రమే మన జిల్లా ఆసుపత్రి నిజమైన పేటెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్ అవుతుందనీ పిలుపునిచ్చారు. వైద్యులు, వైద్య సిబ్బంది మనమందరం కలసి పని చేసి, ఎయిడ్స్ రహిత, వివక్ష-రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం నిలిచేలా చేద్దామని పిలుపునిచ్చారు. ప్రధాన ఆసుపత్రి ఆర్. ఎం. ఓ డాక్టర్. రమేష్, ఎముకల వైద్యులు డాక్టర్. నర్సింహ రావు, డాక్టర్. శాంసన్, డాక్టర్ ప్రవీణ్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. పుల్లా రెడ్డి, డాక్టర్. మధువరన్, ప్రధాన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily