AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / జనవరి 13/ అక్షరం న్యూస్ :- నిత్యం వినూత్న కథనాలు, ప్రజాసమస్యలపై నిర్మాణాత్మక వార్తలతో అక్షరం దినపత్రిక ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని నిజాయితీగా ప్రతిబింబిస్తూ, ప్రజల గొంతుకగా అక్షరం దినపత్రిక నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. మంగళవారం అక్షరం దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్రికలు కేవలం వార్తలు మాత్రమే కాకుండా ప్రజల్లో చైతన్యం నింపే సాధనాలుగా మారాలని, ఆ దిశగా అక్షరం దినపత్రిక సమర్థవంతంగా పని చేస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ పాలనకు – ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పత్రికగా అక్షరం గుర్తింపు పొందిందని తెలిపారు. అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 క్యాలెండర్‌లో ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సెలవులు, జాతీయ–రాష్ట్ర ప్రాధాన్యత గల దినోత్సవాలు, ముఖ్య తేదీలు సమగ్రంగా పొందుపరిచినట్లు తెలిపారు. ఈ క్యాలెండర్ ప్రజల దైనందిన జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అక్షరం దిన పత్రిక ఎడిటర్ మరియు ఛైర్మెన్ షేక్ యాకుబ్ పాషా, సీనియర్ పాత్రికేయులతొ పాటు, అక్షరం అభిమానులు పాల్గొన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం అక్షరం దినపత్రికకు మరింత గౌరవం, ప్రోత్సాహంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily