CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABDReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : -- మహబూబాబాద్ /కేసముద్రం /సెప్టెంబర్ 12/అక్షరం న్యూస్ :-యూరియా కోసం రైతులు కల్వలలో వేచిచూస్తున్నారు.గురువారం కేసముద్రం కు యూరియా లోడ్ తో వచ్చిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ తోలే పరిస్థితిలో లేడు వెంటనే కేసముద్రం పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ ఆపీసర్, కానిస్టేబుల్ అలీమ్ పై అధికారులకు సమాచారం ఇచ్చి,తానే లారీడ్రైవర్ గా మారిపోయి కేసముద్రం నుండి, కల్వలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కు సకాలంలో యూరియాలోడ్ నీ చేర్చాడు. ఈ విషయం తెలుసుకున్న రైతులు మరియు అధికారులు కానిస్టేబుల్ అలీమ్ అభినందించారు.సకాలంలో యూరియా రైతులకు అందించాలనే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పడుతున్న తపన,కష్టం తనను కదిలించిందని,తన బాధ్యతగా బావించి అధికారుల అనుమతితో ఆ పని చేసానని కానిస్టేబుల్ తెలిపారు. శుక్రవారం యదావిధిగా యూరియా పంపిణీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అలీమ్ ను కల్వల గ్రామానికి వచ్చిన ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గమనించి,అతనిని ప్రత్యేకంగా అభినందించారు.రైతులకోసం సమయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఎస్సై కరుణాకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
.
Aksharam Telugu Daily