D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 12 (అక్షరం న్యూస్) తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ కు బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ ఎంపీ, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బడ్జెట్లో ఈ నిధులు కేటాయిస్తే మున్నూరు కాపు యువత, మహిళ, నిరుపేద రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు. సోమవారం ఖమ్మం మున్నూరు కాపు హాస్టల్ భవనంలో జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా సంఘం గౌరవ అధ్యక్షులు కొత్త సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మున్నూరు కాపు సంఘంలో తాను మొదటి నుండి ఎన్నికలకు దూరమని.. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా మన ఐక్యతను నిరూపించుకోవాలనే ఆలోచనతో పనిచేస్తానని అన్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లోని మున్నూరు కాపు సంఘం నాయకుల సమక్షంలో పార్టీలకు అతీతంగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగిందని గుర్తు చేశారు. మున్నూరు కాపు కులంలో జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బీసీలలో మున్నూరు కాపుల జనాభా అత్యధికమని గతంలో వి హనుమంతరావు, డి. శ్రీనివాస్, కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య లాంటివారు సీఎం పదవి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నా చివరి నిమిషంలో చేజారిందని అన్నారు. మున్నూరు కాపులు అన్ని పార్టీలలో ఉండాలని కానీ సరైన సమయంలో ఐక్యత చూపాలని అన్నారు. ఇప్పటివరకు తాను మనం కులానికి చాలా తక్కువగా చేశామని ఇంకా ఎంతో చేయాల్సింది ఉందని అన్నారు. మొదట ఇంట గెలిచి రచ్చ గెలవాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మనం ఎదిగే క్రమంలో స్థానికంగా ఉన్న కులంలో మంచి పేరు సంపాదించి సేవ చేయాలన్నారు. 56% ఉన్న బీసీలను కలుపుకొని వెళ్ళినప్పుడు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రాష్ట్ర మంత్రివర్గంలో మొదటిసారి మున్నూరు కాపులకు స్థానం దక్కకపోవడం బాధాకరమన్నారు. ఖమ్మంలో మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ అభివృద్ధికి, సంఘం మాజీ అధ్యక్షులు మేకల సంగయ్య విగ్రహ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. హైదరాబాదులో వివిధ గ్రూప్ లు, సంఘాలుగా ఉన్న సంఘాన్ని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించడంతో ప్రభుత్వం కోట్లది రూపాయల ఐదు ఎకరాల భూమి ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు రూ. 150 కోట్ల నిధులతో భవన నిర్మాణానికి పునాదులు పడ్డాయి అన్నారు. ముఖ్యంగా జనాభాలో సగం బాగా ఉన్న మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని రాజకీయాలలో రాణించాలన్నారు. యువత వ్యాపారంలో రాణిస్తూ ఐక్యంగా ఉంటూ కుల సేవ చేయాలన్నారు యువత తలుచుకుంటే సాధించలేనిది లేదన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తాము ఎంచుకున్న రంగాల వైపు ముందుకు పోవాలన్నారు. అనంతరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా మాజీ అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పొదిల రవి కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, ప్రధాన కార్యదర్శి పసుపులేటి దేవేంద్రం, నాయకులు మడూరు పూర్ణ, మెంతుల శ్రీశైలం, తోట రామారావు, తోట రమేష్, పగడాల మంజుల, తోట సుజలా రాణి, హారిక నాయుడు, పారా ఉదయ్ కుమార్, మేకల శ్రీనివాసరావు, మేకల నాగేందర్, మిర్యాల రామకృష్ణ, లక్కినేని రఘు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, ఆళ్ల కృష్ణ, కనకం జనార్ధన్, మేకల బిక్షమయ్య, పసుపులేటి నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily