D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : సుమారు 1000 భక్తులకు మహా అన్నదాన .. ఖమ్మం/సెప్టెంబర్/ 4 (అక్షరంన్యూస్) ఖమ్మం నగరంలోని *సుగ్గుల వారి తోట ఏరియాలో శ్రీ శివ సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారిచే నిర్వహించబడుతున్న శ్రీ గణేష్ ఉత్సవాల్లో భాగంగా పల్లా కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. పల్లా కిరణ్ స్వయంగా పాల్గొని అన్న ప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా కిరణ్ మాట్లాడుతూ అన్నదానం చేయడం నాకు ఎంతగానో ఇష్టమైన విషయం. అన్నదాన కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం నాకు ఎంతగానో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ముఖ్యులు, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
.
Aksharam Telugu Daily