Sunday, 15 March 2026 07:47:29 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పేద పిల్లలు చదువులో వెనుకబడకూడదు… వారిని మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం

పాలేరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం 18 నెలల్లోనే 470 కోట్ల రూపాయలు కేటాయింపు. నా నియోజకవర్గంలో ఎన్నికల్లో నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం నాకు గర్వంగా ఉంది.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 31 July 2025 06:58 PM Views : 498

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా/ 31 జూలై/ అక్షరం న్యూస్: పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వాటిలో భాగంగా కూసుమంచి పాత జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ భవనాన్ని డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విద్యార్థులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ తరగతి చదువుతున్న 76 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది.పేద పిల్లలకు ప్రయాణ సౌకర్యం లేక చదువులో వెనుకబడకూడదు. గతేడాది 8, 9, 10వ తరగతుల విద్యార్థినిలు అందరికీ సైకిళ్లు ఇచ్చాం. వచ్చే ఏడాది నుంచి జూనియర్ కళాశాలలో చేరుతున్న విద్యార్థినిలకు కూడా సైకిళ్లు అందిస్తాం.ఈ సందర్భంగా హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశాను. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాలను కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా పేదల కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వ సహాయంతో పాటు అవసరమైతే నేను కూడా వ్యక్తిగతంగా సాయం అందించేందుకు పేద విద్యార్థులకు అండగా ఉంటాను. స్కూల్ అభివృద్ధి కోసం అవసరమైతే స్వయంగా నిధులు సమకూరుస్తాను. ప్రతి విద్యార్థి మంచి చదువులు చదివేలా నా వంతు కృషి చేస్తాను. గత ప్రభుత్వ పరిపాలన వల్లే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం బాధ్యత తీసుకుని, ప్రతి విద్యార్థిని సమాజంలో ఒక ఆభరణంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది.ఏటీసి(ఐటీఐ), స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కొత్త శకాన్ని తీసుకువస్తాయి. ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతం తరుణీ హాట్ లో సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల నిర్మాణాల కోసం స్థలం పరిశీలించడం జరిగింది. నిర్మాణ డ్రాఫ్ట్ ప్లాన్ వివరాలను జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ అధికారుల ద్వారా తెలుసుకొని పలు సూచనలు చేయడం జరిగింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :