AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా / రాజన్న సిరిసిల్ల టౌన్ / జులై 13 / అక్షరం న్యూస్ -: రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి మైనారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఫేక్ రియాజ్ మాట్లాడుతూ అజ్మతుల్లా హుస్సేన్ కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా విద్యార్థి నాయకుడిగా యువజన నాయకుడిగా అంచలంచలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా నియమితులై పార్టీ పరంగా మరియు ప్రభుత్వ పరంగా ఎంతో మందికి సేవలు అందిస్తున్నరన్నారు అని రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి మైనారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. భవిష్యత్ లో అల్లా దీవెనలతో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ కలీం, మహమ్మద్ సలీం, మహమ్మద్ పర్వేజ్, అడ్వకేట్ అన్సర్ అలీ, మహమ్మద్ అయూబ్ పాల్గొనడం జరిగింది.
.
Aksharam Telugu Daily