Monday, 16 February 2026 06:16:25 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బాధితులకు భరోసా.. షాపుల పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం హామీ..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 07 February 2026 05:55 PM Views : 296

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 7 వైరా (అక్షరం న్యూస్) గత ఐదేళ్ల క్రితం వైరా రింగ్ రోడ్డు సెంటర్ విస్తరణలో భాగంగా తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ చిన్న వ్యాపారులకు త్వరలోనే విముక్తి కలగనుంది. శనివారం వైరా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రింగ్ రోడ్ సెంటర్ బాధితులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే చొరవతో చేరిన ఫిర్యాదు స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఈ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను తొలగించడంతో, అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు భట్టి విక్రమార్క స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. తిరిగి షాపుల నిర్మాణం.. బాధితుల గోడు విన్న ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. నష్టపోయిన వ్యాపారులకు ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతు ఉంటుందని, అక్కడ తిరిగి షాపులు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల హర్షం: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ సమస్య పరిష్కారానికి హామీ లభించడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్. వర్తక సంఘం నాయకులు మిట్టపల్లి రాఘవరావు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ల పాటి సీతారాములు వేముల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :