Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్05 అక్షరం న్యూస్ 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గానూ పెద్దపల్లి పురపాలక సంఘం 82.2 శాతం ఆస్తి పన్ను వసూలు చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ తెలిపారు ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ చేతుల మీదగా ప్రశంసా పత్రం పొందినట్లు ఆయన తెలిపారు మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్ను వసూళ్లలో టార్గెట్ ప్రకారం పన్ను వసూలు చేసిన బిల్ కలెక్టర్లను వారికి సహకరించిన మేనేజర్ కట్ట శివప్రసాద్ కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కుమార్‌లను శనివారం సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీమ్‌లో ఆస్తి పన్ను ఈనెల 30లోపు చెల్లిస్తే 5 శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సతీష్, టీపీఎస్ వినయ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily