D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా / కొత్తగూడ / అక్టోబర్ 17(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ : పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామిక ,విలువలు కోసం మరియు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన జర్నలిస్టు యోధుడు షోయబుల్లాఖాన్ అని,, ప్రస్తుతం మతోన్మాదం దేశమంతటా మరోసారి ప్రజ్వ రిల్లుతున్న ప్రస్తుత తరుణంలో షోయబుల్లా ఖాన్ పోరాటాన్ని, త్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని టీయూడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల అధ్యక్షులు ఎస్.కె.సల్మాన్ పాషా అన్నారు... మండల కేంద్రంలోనీ గ్రామపంచాయతి ఆవరణంలో నిర్వహించిన షోయబుల్లాఖాన్ 106వ జయంతి సందర్భంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువు కొని ప్రభుత్వోద్యోగంలో చేరకుండా ఆదాయం తక్కువైన్నప్పటికీ జర్నలిస్టు వృత్తిని ఎంచుకున్నాడు. జీ హుజూర్ అనకుండా స్వేచ్ఛగా బతకడమే గాకుండా పదిమందిని చైతన్యపరిచేందుకు పత్రిక రంగమే గొప్పదని తలిచిండు.. మొదట 'తేజ్' అనే పత్రికలో పనిచేసి నిజాం ప్రభుత్వాన్ని, అధికార వర్గాన్ని విమర్శించడంతో దాన్ని నిషేధించారు. ఇవ్వాళ పత్రికా స్వేచ్ఛర్యాంకింగ్ ల్లో మొత్తం 180 దేశాల్లో ఇండియా 161వ స్థానంలో ఉన్నది. 'రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్' అనే సంస్థ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జర్నలిస్టు రాణా అయూబ్ పోస్టులను ప్రభుత్వ ఆదేశా లకు తలొగ్గి 'ట్విటర్' సంస్థ తొలగించింది. జర్నలి స్టు రవీష్కుమార్, తులసి చందు ఇట్లా వందలాది ప్రశ్నించే వారిని ట్రోలింగ్ చేయడం, కొన్ని చోట్ల భౌతిక దాడులకు గురి చేయడం నిత్యకృత్యమయింది అని, ఇట్లా మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్న ప్రస్తుత తరుణంలో దేశ ఐక్యత, లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేసే, నిజాల్ని వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుల హక్కుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడిన వీరుడు షోయబుల్లా ఖాన్ ను మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాలని, షోయబుల్లా ఖాన్ హత్య ప్రజాస్వామ్యానికి, లౌకిక విలువలకు, పత్రికా స్వేచ్ఛకు పెద్ద విఘాతం అని చనిపోయి 80 ఏండ్లయిన తర్వాత కూడా ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదాన్ని మీడియా ఎదుర్కొంటున్నది. రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19(1)ఎ లో కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో వర్కింగ్ జర్నలిస్ట్ లు అంత షోయబుల్లాఖాన్ లాంటి త్యా గధనుల స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి అని ప్రస్తుతం దేశమంతటా రగులుస్తున్న చిచ్చును చల్లార్చాలన్నా, షోయబ్ ఆశయాలు సదా ప్రచారంలో ఉండాలన్నా ఆయన స్మారకంగా ప్రతియేటా ‘హిందూ–ముస్లిం’ ఐక్యతను కాపాడి, పెంపొందించే ఒక ఉత్తమ జర్నలిస్టుకు తెలంగాణ ‘మీడియా అకాడెమి’ తరపున అవార్డు ఇవ్వాల్సిన అవసరమున్నది. అంతేగాదు ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరమున్నది అని అన్నారుఈ కార్యక్రమంలో ఐజేయూ జిల్లా నాయకులు పాలడుగు శ్రీధర్, శెట్టి పరుశురాం, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్,ప్రచార కార్యదర్శి తీగల ప్రేమ్ సాగర్, రాకేష్ వర్మ , ముఖ్య సలాదారులు సునీల్,రాజు కుమార్, చాపల శ్రీనివాస్ , వెంకట్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily