AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 11/ అక్షరం న్యూస్/----- భద్రతా బలగాలనే లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన మందు పాతర ప్రెషర్ ఐఈడి పేలి 206 కోబ్రా దళానికి చెందిన సైనికుడికి గాయాలయ్యాయి. వివరాల్లోనికి వెళితే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారికాంకేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊసూర్ అడవి ప్రాంతంలో 206 కోబ్రా దళాలకు చెందిన భద్రత బలగాల బృందం సాధారణ ఏరియా డామినేషన్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు లక్ష్యంగా చేసుకొని మావోయిస్టు అమర్చిన ఫ్రెషర్ ఐఈడి పేలి ఒక సైనికుడికి గాయాలు అయినాయి. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై గాయపడిన సైనికుడికి మెరుగైన వైద్య చికిత్స అదించడం కోసం జిల్లా కేంద్రం లోని ఆస్పటల్ కి తరలించారు. ప్రస్తుతం సైనికుడు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily