D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 29 వైరా (అక్షరం న్యూస్) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియ తండా గ్రామ సమీపంలోని ఎన్ఎస్పి కెనాల్ లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన నల్లాని బద్రీనాథ్ (45) అనే వ్యక్తి గోపాలపురం గ్రామ సమీపంలోని ఎన్ఎస్పి కెనాల్లో ప్రమాదవశాత్తు జారిపడి అదృశ్యం అయ్యాడు.. కొణిజర్ల మండలం బోడియో తండా సమీపంలో ని ఎన్ఎస్పి కెనాల్ లో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు కు సమాచారం అందించడంతో కెనాల్ లో మృతదేహాన్ని వెలికి తీసి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతదేహంగా గుర్తించిన పోలీసులు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసులో ఉన్న బద్రీనాథ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొనిజర్ల ఎస్ఐ సూరజ్ కేసు నమోదు చేశారు.
.
Aksharam Telugu Daily