D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 8 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదినోత్సవం సందర్భంగా తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్ నందు అన్నప్రసాదం వితరణ అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మరియు డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ దారా శ్రీనివాసరావు , మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అంగర్ రిలీఫ్ వీక్ గా ప్రకటించి ఈ వారం రోజులు ప్రతిరోజు అన్న ప్రసాదం వితరణ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజున రింగ్ రోడ్డు సెంటర్ నందు పాదచారులకు అల్పాహారం వితరణ చేశారు . లయన్ సభ్యులు జి బాలకృష్ణ స్పాన్సర్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నంబూరు కనకదుర్గ ప్రసాద్, ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు మాజీ సెక్రటరీ కటికి వెంకటేశ్వరరావు , మాజీ ట్రెజరర్ శీలం వెంకట్ రెడ్డి, తోట మురళి, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily