DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : * పెద్దపల్లి/ జనవరి 01 (అక్షరం న్యూస్) పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పలు ప్రజా చైతన్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడినట్లు గ్రామ సర్పంచ్ సోమ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలోని దేవాలయం, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోమ కుమార్ మాట్లాడుతూ, “గ్రామ అభివృద్ధిలో శుభ్రత, పచ్చదనం, ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచాలని” పిలుపునిచ్చారు. పారిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమని, వారి కృషి వల్లే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily