DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .. పెద్దపల్లి టౌన్ జూలై 07 అక్షరం న్యూస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా బిఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్రాజెక్టులపై రైతులకు ప్రజలకు విష ప్రచారాన్ని చేరవేస్తున్నారని అవి ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో ప్రజలకు, రైతులకు తెలుసని అన్నారు. రైతన్ననికి అవసరమైన నీరు అందించేందుకు పైపుల ద్వారా ఎత్తిపోసే అవసరం లేకుండానే తుమ్మడి హైట్టిని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తూమ్మీడి ఎట్టి నుండి ఎల్లంపల్లి కి నీరును తీసుకువచ్చే విధంగా రూపకల్పన చేపట్టారని తెలిపారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలతో ప్రజా ధనాన్ని వెచ్చించి కాలేశ్వరం ప్రాజెక్ట్ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వారి కుటుంబ ప్రయోజనాల కోసం నిర్మాణం చేపట్టారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నీళ్లను కింది నుండి పైకి ఎత్తిపోసే ప్రాజెక్ట్ కెసిఆర్ ఇంజనీర్ అవతారం ఎత్తి నిర్మించారని ఆ ప్రాజెక్టు నాలుగు నుండి ఐదు సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరానికి 180 టీఎంసీల చొప్పున నీళ్ళు ఎత్తి పోసారని అబదప్పు మాటలు చెప్పి పబ్బం గడిపారు. అలా అయితే ఐదు సంవత్సరాల కాలంలో 900 టీఎంసీల నీరును పోయాల్సి ఉండగా 74.5 టిఎంసిల నీళ్లను మూడు ప్రాంతాలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్ట్ ల ద్వారా ఎల్లంపల్లికి పంపిణీ చేసి ఎల్లంపల్లి లో ఉన్న 40 టీఎంసీల నీరును కలుపుకొని కేవలం 114 టీఎంసీల నీళ్లను ఐదు సంవత్సరాలలో ఎత్తిపోసారని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ మానస పుత్రిక అని, ప్రపంచంలో ఎనిమిదో వింత అని సొంత బస్సులలో రైతులను, ప్రజలను తరలించి టూరిజం ప్రాజెక్టుగా చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఎస్సారెస్పీ ఎల్లంపల్లి వరద కాలువల ద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి కాలేశ్వరం తో సంబంధం లేకుండా గతంలో ఎన్నడు లేని విధంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతంగం పండించేందుకు నీరును అందించడం జరిగిందన్నారు. పీవీ నరసింహా రావు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో 200 కోట్లతో వరద కాలువలకు శంకుస్థాపన చేపట్టారని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వరద కాలువలను పూర్తి చేసి ఎస్సారెస్పీ ద్వారా రెండు డ్యాములు నింపారని తెలిపారు. తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఐదున్నర కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి వరద కాలువల నిర్మాణం చేపట్టిందని 182 కిలోమీటర్ల పైన కాలువల నిర్మాణం పూర్తయిందని వివరించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు లేఖ ఇచ్చారని వివరించారు. మీ పాలనలో ఎండాకాలంలో ప్రాజెక్టులు మొదలుపెడితే వానకాలంలో కూలిపోయే పరిస్థితిలో నెలకొన్నాయని దానికి నిదర్శనమే కాలేశ్వరం ప్రాజెక్టు అని వివరించారు. హుస్సేమియా వాగులపై నిర్మాణం చేసిన చెక్ డ్యాముల సైతం కూలిపోయాయి పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలను బయట పెడుతుంటే అప్పటి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారిని అడ్డుకున్న చరిత్ర బిఆర్ఎస్ పార్టీ వరిదని వివరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి, ధర్మారం, మంథని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్ని నాగార్జునసాగర్, పులిచింతల, హుస్సేన్ సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు లోయర్ మానేరు ఏకశిలా, ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణమయ్యాయని ఇప్పటివరకు చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మా ప్రాంతాల నుండి నీళ్లు తీసుకుపోయి మీరు ఈ ప్రాంతంలో వాడుకున్నదీ నిజం కాదా అని ప్రశ్నించారు. పెద్దపల్లి టేలెంట్ ప్రాంతం పూర్తిగా బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఎండిపోయిందని ఎద్దేవా చేశారు. అబద్దాలను ప్రజలకు చెప్పడం మానేసి అవసరమైన సలహాలు సూచనలు అందించాలే తప్ప మోసపు మాటలు చెప్పడం మానుకోవాలని అన్నారు. హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం సశ్యామలమవుతుందని అబద్ధపు మాటలు చెప్పారే తప్పా ఈ ప్రాంతానికి నీరు అందించిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు మరియు పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్లు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily