D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం 9స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 వైరా (అక్షరం న్యూస్) గ్రేట్ విజన్ లయన్స్ క్లబ్ మరియు వైరా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వైరా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘ఆల్ ఇన్ వన్’ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైరా గ్రేట్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు జాలా పుల్లారావు వైరా ఎస్ ఐ పుష్పలా రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎస్ ఐ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. చదువుతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మరో ముఖ్యఅతిథి గా లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా విద్యారంగానికి తమ వంతు సహకారం అందించడం గర్వంగా ఉందని తెలిపారు. పాఠశాల.ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ లయన్స్ క్లబ్ మరియు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమము లో డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ లగడపాటి ప్రభాకరరావు విజన్ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యామ్ బాబు, జెసి సిహెచ్ నాగేశ్వరావు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తోటకూర శ్రీకాంత్, వుయ్యురు రామకృష్ణ ఎంఈఓ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily