Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల/ పెద్దపల్లి మే 15 (అక్షరం న్యూస్) అకాల వర్షం మరియు ఈదురు గాలుల కారణంగా కరెంటు వైర్లు తెగి 25 మూగజీవా లు చనిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే చలించి ఆర్థిక సాయం కింద 21500 బాధిత కుటుంబానికి అందించి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన రాజ కొమరయ్యకు సంబంధించిన మూగజీవాలు కరెంటు వైర్లు తెగి మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకొని గురువారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మడక గ్రామానికి చేరుకొని కొమురయ్య ను పరామర్శించి తక్షణ సాయం కింద 21 500 ఆర్థిక సాయం అందించారు అదేవిధంగా విద్యుత్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అంది విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా బాధితునికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గొర్రెల పెంపకం పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కుటుంబం ఈ ప్రమాదం వల్ల ఎంతో నష్టపోయిందన్నారు. ఈ కుటుంబానికి తాము అండగా ఉంటామని చెప్పారు. సిఎండి మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన సహకారాన్ని బాధిత కుటుంబానికి అందించాలని ఆదేశించారు, దీనికి వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వ పరంగా కూడా సహాయాన్ని అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు ఆర్థికంగా నష్టపోయామని ఆధర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎ.డి.ఈ మధుకర్ , ఎ.ఈ మోహన్ నాయక్ , స్థానిక తహసిల్దార్,జె సునిత సి.ఐ సుబ్బా రెడ్డి మరియు సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి. నాయకులు చీకట్ల మొండయ్య గోపు నారాయణరెడ్డి చొప్పరి రాజయ్య రాజేశం నోముల సాగర్ రెడ్డి మడక గ్రామ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily