D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం వైరా టౌన్ అక్టోబర్ 13 (అక్షరం న్యూస్) వైరా వ్యవసాయ మార్కెట్లో అక్టోబర్ 5వ తారీఖున మార్క్ పేడ్ ద్వారా పెసలు కొనుగోలు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ నేటి వరకు పెసలు కొనుగోలు గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం రైతులు మార్కెట్ యార్డ్ ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు• ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర్ సుధాకర్, తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి కొంగర సుధాకర్ మాట్లాడుతూ పెసర రైతుల పట్ల ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కొనుగోలు చేయటానికి వచ్చిన మార్క్ ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్లక్సిపైన ప్రధానమంత్రి ఫోటో లేదని, పెసలు క్వాలిటీ తక్కువ ఉన్నాయని, పలు రకాల ఆంక్షలు పెట్టి అభ్యంతరాలు తెలుపుతున్నారని విమర్శించారు• రైతులకు సంబంధం లేని విషయాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని వ్యత్యాసాలతో అధికారులు వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, తక్షణమే రైతుల వద్ద పెసలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు• నిరంతరం రైతులు మార్కెట్ లో కాపలా ఉండాల్సి వస్తుందని, రాత్రిపూట దోమలు ఎక్కువగా ఉన్నాయని, మార్కెట్లో లైట్లు, సిసీ కెమెరాలు లేవని, దొంగల భయంతో ఆందోళన కరంగా మార్కెట్ నడుస్తోందని, తక్షణమే అధికారులు స్పందించి మార్కెట్లో ఉన్న పెసలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు• అనంతరం స్థానిక తహసీల్దార్ సిహెచ్• సురేష్ బాబు, ఎస్ఐ పుష్పాల రామారావు ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకుని పెసలు కొనుగోలు కేంద్రానికి అధికారులు వస్తున్నారని, వెంటనే పెసలు కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు• ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు మల్లెంపాటి రామారావు, నాయకులు హరి వెంకటేశ్వరరావు, దామా వెంకటేశ్వరరావు, రైతులు పఠాన్ సైదాఖాన్, మల్లేల వెంకటేశ్వరరావు, దురిశెట్టి కృష్ణ, వందలాది మంది రైతులు తదితరులు పాల్గొన్నారు•
.
Aksharam Telugu Daily