Wednesday, 04 March 2026 01:41:32 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సీఎం దిష్టిబొమ్మ దహనకి ప్రయత్నం అడ్డుకున్న ఎస్సై


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 02 November 2025 03:11 PM Views : 533

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి నవంబర్ 03 (అక్షరం న్యూస్) ఆదివారం ఓదెల మండల కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆపరేషన్ సింధూరు పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన చేసేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్న ఎస్ఐ దీకొండ రమేష్ మరియు పోలీసులు ఈ సందర్భంగా కారెంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని భయంతో ఏం చేయాలో అర్థం కాక ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి భయంతో ఆపరేషన్ సింధుర్ గురించి అనుచిత వ్యాఖ్యలను చేసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నామని ఉప ఎన్నికల్లో మైనార్టీలను తన వైపుకు తెంపుకోవడం కోసమే ఇంకో కొత్త నాటకానికి తెరలైపోయారని దానికి ఉదాహరణ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారో తనకే తెలియకుండా మాట్లాడుతున్నారని అజారుద్దీన్ ఇండియా కి క్రికెటర్ కెప్టెన్ గా ఉండి ప్రపంచకప్ తెచ్చాడని చెప్పడం ఆసియాస్పదమని రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒక ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గాలలో రైతులకు భరోసా కల్పించకుండా ప్రచారంలో తిరుగుతున్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రజలు ముఖం మీద అడుగుతున్నారని అన్నారు. మీకు ప్రజల పైన రైతుల పైన చిత్త శుద్ధి ఉంటే ఈ అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఒక ఎకరాకు 35 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అలాగే కూరగాయలు పండిస్తున్న రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని మరియు నల్లబడ్డ వడ్లను చరుతులు లేకుండా తడిసిన వడ్లను ఏలాంటి మ్యాచర్ లేకుండా కొనుగోలు చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓదెల మండల శాఖ తరపున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కారెంగుల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ కొలనూర్ జిల్లా నాయకులు తీర్థాల కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మెరుగు సారంగం, మెడుదుల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు రామినేని రాజేంద్రప్రసాద్, పోలోజు శ్రీహరి, మండల కార్యదర్శి కొత్తం శ్రీనివాస్ రెడ్డి, శాతల్ల కుమార్ , మెరుగు కృష్ణ,బూత్ అధ్యక్షులు కోక్కుల శ్రీకాంత్,క్యాతo మల్లేష్, బేరం తిరుపతి, చీదురు సాగర్, తదితరులు బిజెపి నాయకులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :