P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 05 (అక్షరం న్యూస్) పోత్కపల్లి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రజిత హైదరాబాద్: నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న. సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో లక్కీ డ్రాలు, లడ్డూ వేలంపాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, ఓ గణేష్ మండపంలో జరిగిన లక్కీ డ్రాలో వినాయకుడి లడ్డూను గెలుచుకుని కానిస్టేబుల్ రజిత వార్తల్లో నిలిచారు. నిన్న రాత్రి జరిగిన లక్కీ డ్రాలో రజిత పేరు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. వినాయకుడి లడ్డూను తాను గెలుచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి పండుగలు తమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని రజిత పేర్కొన్నారు. ఆమె గెలుచుకున్న లడ్డూను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకుంటానని చెప్పారు. ఈ సంఘటనతో మండపం నిర్వాహకులు, స్థానికులు రజితను అభినందించారు. ఈ విధంగా వినాయక ఉత్సవాల్లో లక్కీ డ్రాలు, ఇతర పోటీలు ప్రజలకు మరింత ఆనందాన్ని పంచుతున్నాయి.
.
Aksharam Telugu Daily