Wednesday, 04 March 2026 01:49:22 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నూతన ఆర్టీఐ కమిషనర్లను కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా సొసైటీ సభ్యులు....మహమ్మద్ అమీర్ ఖాన్.

పెండింగ్ లో ఉన్న ఆర్టీఐ కేసులను త్వరగా పరిష్కరించాలి - రాష్ట్ర ఆర్గనైజర్ చెట్టబోయిన విద్యాసాగర్.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 11 June 2025 06:02 PM Views : 831

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : హైద్రాబాద్ / జూన్ 11 / అక్షరం న్యూస్ - సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ సభ్యులు నూతన తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్లు మొహసీనా పర్వీన్, దేశాల భూపాల్ భొరెడ్డి అయోధ్య రెడ్డిలను హైద్రాబాద్ లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఆర్గనైజర్ అడ్వకేట్ చెట్టబోయిన విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఆర్టీఐ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరారు. దరఖాస్తు తిరస్కరణపై సెక్షన్ 6(1), పిఐఓలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సహ చట్టం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ త్వరలో వరంగల్ జిల్లాలో సమాచార హక్కు చట్టంపై కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధమైనట్లు కావున ఇట్టి అవగాహన కార్యక్రమాలకు ఆర్టీఐ కమిషనర్లు హాజరై సహ చట్టాలపై వివరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్లు స్పందిస్తూ రాష్ట్రంలో ఆర్టీఐ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సామాన్యుడికి ఆర్టీఐ చట్టం ఒక వజ్రాయుధమని, క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి సామాన్యుడికి జవాబుదారితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో వివిధ గ్రామీణ ప్రాంతాలలో ఆర్టీఐ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సామాన్యుడికి వారి హక్కులను తెలియజేస్తూ, ఆర్టీఐ దరఖాస్తులు రాయడంలో, సమాచారం పొందడంలో సహకరిస్తున్న సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఎండీ.షరీఫ్ హనుమకొండ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ, వరంగల్ జిల్లా స్టూడెంట్ సెక్రటరీ ఎద్దు రాహుల్ పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :