AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 11/ అక్షరం న్యూస్/---- మండల కేంద్రం లోని గ్రామపంచాయతీ కాంప్లెక్స్ నందు శీలం సంతోష్ అధ్యక్షతన బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మండలం అధ్యక్షులు కొట్టే నవీన్ హాజరైయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లోని విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ కాలేజీలో పర్యటించి కాలేజీలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. కాలేజీలో ఉన్న అధ్యాపకులు సగానికి పైగా ఎవరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని స్థానికంగా ఉండడం లేదని ఇష్టానుసారంగా సమయపాలన పాటించకుండా వస్తున్నారని ఆయన అన్నారు. క్లాస్ రూమ్ లలో సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారు. కళాశాల లోని అధ్యాపకులు గ్రూప్ లుగా ఏర్పడి గ్రూప్ రాజకీయాలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారానీ అన్నారు. కాలేజీ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. దట్టమైన పోదలు పెరగడం వల్ల విష సర్పాలు తిరుగుతున్నాయి. విద్యార్దులను దృష్టిలో ఉంచుకొని పరిసరాలను శుభ్రం చేయించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సమయ పాలన పాటించాలన్నారు. లేనియెడల బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాద్యాక్షుడు ఎం ఎల్ నారాయణ నీలం సంతోష్ కట్ట రాజేష్ జంజీరాల సుజిత్ ధనుష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily