D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 10 వైరా (అక్షరం న్యూస్) మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంతో జరిగేలా సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ డీసీపీ (లా&ఆర్డర్) ప్రసాద్ రావు అన్నారు. వైరా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పోలీస్ సిబ్బంది యెుక్క ఎన్నికల విధులు, విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై వైరా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో వైరాలోని వెటర్నరీ హాస్పిటల్ భవనంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పనిచేయాలన్నారు. ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని,ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని స్పష్టంచేశారు.ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్వహించే విధులలో పూర్తి అవగాహన వుండాలన్నారు. అదేవిధంగా ఎన్నికల ముగిసిన తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకొవాలని సూచించారు. సెక్షన్ 163 బిఎన్ ఎన్ ఎస్ అమలులో ఉన్నందున పోలింగ్ కేంద్రల పరిసరాల్లో గుంపులు గుంపులుగా లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో సిసిఎస్ ఏసిపి సర్వర్, సిఐలు, ఎస్సై లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily