Sunday, 16 August 2026 02:21:27 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అమరవీరుల త్యాగఫలమే మనకు స్వాతంత్ర్యం -ప్రెస్ క్లబ్ అద్యక్షలు నారాయణ దాస్ అశోక్ -ప్రధాన కార్యదర్శి పోగుల విజయ్ కుమార్ -ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 15 August 2026 03:18 PM Views : 66

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగస్టు15 అక్షరం న్యూస్ మనకు స్వాతంత్ర్యం రావడానికి లక్షలాది మంది పోరాటం, వేలాది మంది ప్రాణ త్యాగాలు కారణమని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు నారాయణ దాస్ అశోక్,పోగుల విజయ్ కుమార్ అన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మహాత్మా గాంధీ,డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం కుల, మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే జాతీయ పండుగ అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను,భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కృషిని,రాజ్యాంగ విశిష్టతను వివరించారు.దేశం కోసం అమరులైన వారి త్యాగాలను కొనియాడారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు,పాత్రికేయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో గౌరవ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి, ప్రెస్ క్లబ్ సభ్యులు వీరమల్ల విద్యాసాగర్ రావు, ముత్యాల కృష్ణమూర్తి, శ్రీరాముల సురేష్, ఈదునూరి జైపాల్, బోనాల నాగరాజు, కొలిపాక కృష్ణ, రావుల చంద్రమౌళి, ఉప్పు శ్రీనాథ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :