AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : అక్షరం/ ప్రతినిధి, పెద్దపల్లి సెప్టెంబర్ 28: పెద్దపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన అల్పాహార కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించగలరని అన్నారు. పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యం, ఏకాగ్రత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యాధికారులు తహసిల్దార్ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ పట్టణ కౌన్సిలర్లు పలు గ్రామాల ప్రజాప్రతినిధులు వ్యవసాయ మార్కెట్ సింగిల్ విండో చైర్మన్లు మరియు డైరెక్టర్లు మండల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily