D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్/జనవరి 3 /వైరా (అక్షరం న్యూస్) ద్విచక్ర వాహనదారులు. నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, (ట్రైనీ) వైరా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దినేష్, స్పాట్కస్ లు పేర్కొన్నారు. 37వ జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు మూడవరోజు కార్యక్రమంలో భాగంగా వైరా రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో ద్వి చక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ .. ప్రయాణాలు చేసేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్వి చక్రం వాహనాలపై వెళ్లేటప్పుడు డ్రైవర్ తోపాటు వ్యక్తికి కూడా హెల్మెట్ ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా మద్యం సేవించినప్పుడు ఏమాత్రం కూడా వాహనం జోలికి వెళ్లకూడదన్నారు. మద్యం మానవుడిలోని నరాల్లోనికి వెళ్లి నిద్ర వ్యవస్థకు వెళ్తుందని, అలాంటప్పుడు నిద్రతోపాటు రాత్రి వాహనాలు వెలుగుల డబల్ గా కనిపించడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న సిగ్నల్స్ ను వాటి విలువను తెలుసుకోవాల్సిన అవశ్యకాత ఎంతైనా ఉందన్నారు. సిగ్నల్స్ సూచిక. బోర్డుల ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు నున్నారు. మూల మలుపుల వద్ద ఓవర్టేక్ చేయవద్దని. పూర్తిగా ఎడమవైపు వెళ్ళాలని సూచించారు. అదేవిధంగా ఎప్పుడైనా ప్రమాదాలు జరిగి ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారికి వెంటనే ప్రథమ చికిత్సతో పాటు 108.101. 104 సమాచారం అందించి, వారి ప్రాణాలను కాపాడిన వారమవుతామన్నారు. ఎంతో ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలు ఓర్చి ఇంజనీర్, డాక్టర్ల ను తయారు చేస్తే వారు రోడ్డు ప్రమాదాలు వల్ల బల్తేతే ప్రభుత్వం ఖజానాకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా ఆ కుటుంబాలు వీధిన పడతాయని, వాటన్నిటిని గమనించి వాహనాలు నడపాలని సూచించారు. మన ప్రాణాలలో కాపాడుకోవడంతో పాటు ఎదుటి వచ్చే వారి ప్రాణాలను కాపాడుకోవడానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హోంగార్డు ఆలీ, వైరా యూనిట్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily