D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా టౌన్ అక్టోబర్ 28( అక్షరం న్యూస్) అర్నబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ తెలిపారు అధికారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అందించేసూచనలు పాటించాలని ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్తు వైర్లు నుండి దూరంగా ఉండాలనివర్షాలు కారణంగా ఈదురుగాలలు సమయంలో ఇళ్ళల్లో ఉండాలని ఆమె సూచించారు.అవసరం లేకుండా బయటికి వెళ్ళవద్దని నీరు నిలిచిన రోడ్లు దాటవద్దని సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈదురు గాలుల వలన వార్డులలో ఇబ్బందున్న చెట్లు విరిగిపడిన వెంటనే మున్సిపల్ అధికారులకు దృష్టికి తీసుకురావాలని చంద్రకళ సూచించారు ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త వహించాలని ఇళ్లలో నీరు నిలవకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily