GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 8 అక్షరం న్యూస్: మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం అల్లంపూర్ణ చందర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సమక్షంలో అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025 ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల గురించి చర్చించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానావేన సదయ్య, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్,బిజెపి మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ మరియు సంతోష్, సతీష్ ఎంపీటీసీ జడ్పిటిసి సంబంధించిన డ్రాప్ పోలింగ్ స్టేషన్స్ మరియు డ్రాప్ ఎలక్ట్రోర ల్ రోల్స్ జాబితా ప్రదర్శన చేయడం జరిగినది ఇట్టి డ్రాప్ పోలింగ్ స్టేషన్ మరియు డ్రాప్ ఎలక్టోరల్ రోల్స్ ఏమైనా అభ్యంతరాలు ఉన్న తెలుపగలరని ఎంపీడీవో కోరడం జరిగినది ఎలాంటి లోపాలు లేవని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అల్లం పూర్ణచందర్ రావు,సూపర్డెంట్ శ్రీధర్ ,సీనియర్ అసిస్టెంట్ రంగు రవి పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily