Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మార్చి 20 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని రూప్ నారాయణపేట నుండి విలాసాగర్ వరకు మానేరుపై వంతెన నిర్మించడం కోసం రిక్కీ సంస్థ అధికారులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి డి ఇ ఆర్అండ్ బి జెఈ తో కలిసి సర్వే నిర్వహిస్తున్నారు సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మ్యాపును చూపెడుతూ సర్వే పనుల గురించి పూర్తిగా వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఈ మానేరు పై బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు అన్ని పనులు జరుగుతున్నాయని అందుకోసమే ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని ఇప్పటికే కొంత ఆలస్యం జరిగిందని ఎందుకంటే. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున కొంచెం ఆలస్యం జరిగిందని అధికారులు సర్వే నిర్వహించడం సంతోషంగా ఉందని ఎందుకంటే త్వరగా సర్వే పూర్తి చేస్తే ఎండ కాలంలోనే మానేరు నదిపై పిల్లర్లు నిర్మాణం చేసేందుకు సులువుగా ఉంటదని అందుకోసం సర్వే పూర్తి అయిన వెంటనే టెండర్ ప్రక్రియ మొదలుపెట్టి పనులు వెనువెంటనే జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు మానేరు వాగు పై వంతెన నిర్మిస్తే ఓదెల మండలం ప్రజలకు జమ్మికుంట, వరంగల్ పోవాలంటే సుమారు 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు.. రూపు నారాయణపేట , విలాసాగర్ మధ్య మానేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన అనంతరం భూ సర్వే త్వరగా చేసి బ్రిడ్జి పనులు ప్రారంభించేలా అధికారులు త్వరగా సర్వే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు భూ సర్వే పూర్తయిన త్వరలోనే బ్రిడ్జి పనులకు టెండర్ పిలిసి శంకుస్థాపన చేసుకుందామని అన్నారు.. కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు సర్వేర్లు మరియు సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి. పడాల రాజు అంకం రమేష్ బొంగోని శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily