Wednesday, 04 March 2026 01:50:09 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సొంత గూటికి యువనేత మద్దుల = కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో ప్రశాంత్ చేరిక = పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాయిన్

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 07 January 2026 08:35 PM Views : 192

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 07/అక్షరం న్యూస్: యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ సొంతగూటికి చేరారు. బుధవారం ఆయన హుజురాబాద్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ పార్టీలో చేరారు. ప్రశాంత్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణారెడ్డి బిజెపి కండువా కప్పి యువ నాయకుడు ప్రశాంత్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రశాంత్ గతంలో బిజెపిలో క్రియాశీలకంగా పనిచేసిన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంతో పాటు ఇతర సందర్భాల్లోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచిన మద్దుల ప్రశాంత్ పటేల్ బిజెపిలో చేరడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతానని, ప్రజా శ్రేయసు యే ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా బిజెపి నాయకుడు ప్రశాంత్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ పుప్పాల రఘు,వీణవంక మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్, బిజెపి జిల్లా నాయకులు చెన్నమనేని నరసింహారాజు, రామిడి ఆదిరెడ్డి, గొడుగు వినోద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :