P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి డిసెంబర్ 21 (అక్షరం న్యూస్) తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓదెల మండలంలోని గ్రామాల్లో గెలిచిన నూతన సర్పంచులకు బాధ్యతలతో పాటు సమస్యల సవాళ్లు ఎదురవుతున్నాయి. గత రెండేళ్లుగా సర్పంచ్ ఎవరు లేకపోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు పేరు కుపోయాయి కొన్ని గ్రామాలలో అయితే గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కొన్ని గ్రామాలలో అయితే ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా గ్రామాలలో విపరీతమైనటువంటి సమస్యలు కొత్త సర్పంచ్లకు సవాల్ గా మారాయా! ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచుల రాకతో ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయా గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో సైడ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి తెలిసింది కొన్ని గ్రామాలలో అయితే పైప్ లైన్ లీకేజీలతో దారులని బురదమయం అయ్యాయి * రెండేళ్ల నుంచి గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు " కొత్త సర్పంచ్ లు పరిష్కరిస్తారని ఆశిస్తున్న ప్రజలు సవాళ్ల నడుమ ప్రమాణ స్వీకారానికి సన్నద్ధం అవుతున్న సర్పంచులు పడుతున్నారు. మరోవైపు రోడ్లపై చెత్త పేరుకుపోయినా తొలగించేందుకు సిబ్బంది సహకారం అందకపోవ డంతో పారిశుద్ధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో కొత్త సర్పంచులు పరిశుభ్రతపై అత్యవసర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వాటిని తరిమివేయడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో వీధి కుక్కలు అనేక వింత రోగాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన ఆ సమస్య పరిష్కరించకపోవడం అదేవిధంగా ప్రజలకు విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే కుక్కలకు వింత రోగం చౌకి విపరీతమైనటువంటి రక్తాలు కారుతూ మనుషులపై దాడి చేస్తున్నాయని పలు ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా రోడ్లకు ఇరు -వైపులా పెరిగిన చెట్లు, పొదలను తొలగించి రహదారు లను శుభ్రపరచాలన్న అభ్యర్ధనలూ వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభివృద్ధి హామీలను అమలు చేయాలన్న అంశంపైనా ఆయా గ్రామస్తులు దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్య లకు కొత్త సర్పంచ్ లు పరిష్కారం చూపుతూ అభివృ ద్ధికి బాటలు వేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ సవాళ్ల న్నింటిని ఎదుర్కొంటూ గ్రామాభివృద్ధికి ముందడుగు వేయనున్న సర్పంచులకు గ్రామ ప్రజలు సమస్యలతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు దీన్ని అధిగమించి సర్పంచులు ఏ మేర గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు చూడాలి!
.
Aksharam Telugu Daily