Friday, 21 August 2026 10:29:08 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎరువుల కోసం కొత్త యాప్.. రైతులు తప్పనిసరిగా బుకింగ్ చేసుకోవాలి వ్యవసాయ అధికారిని అనూష

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 21 August 2026 06:33 PM Views : 720

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -21(అక్షరం న్యూస్ ) ఎరువుల విక్రయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ ఎఫ్ ఎస్ ) యాప్ ఆగస్టు 21, 2026 నుంచి అందుబాటులోకి వచ్చిందని ముస్తాబాద్ మండల వ్యవసాయ అధికారి అనూష తెలిపారు. ఇకపై యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్ని రకాల ఎరువులను ఈ సెంట్రల్ యాప్‌ ద్వారానే బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు. రైతులు ఆధార్ లేదా రైతు రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్‌లో లాగిన్ కావడానికి ప్రతి రైతు ముందుగా రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడంతో పాటు, రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన మొబైల్ నంబర్‌నే ఉపయోగించాలి అని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి కాని రైతులు వెంటనే ఏఈఓలను లేదా మీ-సేవ కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు. రైతులు తమ మొబైల్‌లోని ప్లేస్టోర్‌లో “ఎఫ్ ఎఫ్ ఎస్ ” అని టైప్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎరువుల బుకింగ్‌ను సెంట్రల్ యాప్‌ ద్వారానే చేసుకోవాలని ఆమె సూచించారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :