AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాచలం కొత్తగూడెం/చర్ల ఆగస్టు 20/అక్షరం న్యూస్/---సత్యనారాయణపురం జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాల యందు పి ఆర్ టి య టి ఎస్ మండల అధ్యక్షుడు ఎస్ ఎస్ ఎస్ రవికుమార్ జి పి ఎస్ రద్దు కోరుతూ ధర్నా వాల్ పోస్టర్స్ విడుదల చేశారు. అనంతరం ఎస్ ఎస్ ఎస్ రవికుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలంటూ తలపెట్టిన ధర్నాకు సిపిఎస్ ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా జిపిఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు కూడా పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో వాగ్దానం చేసిన విధంగా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సాంబమూర్తి రామారావు సారయ్య వీరభద్రం వేణు శ్రీనివాస్ గురుమూర్తి మోహన్ నాగేశ్వరరావు పున్నం సావిత్రి జ్యోతి ఇందిరా పద్మలత తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily