Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 13(అక్షరం న్యూస్ ) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ సత్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 2025 -26 సంవత్సరానికి గాను 5వ తరగతితో పాటు ఖాళీగా ఉన్న 6,7,8 తరగతిలో మరియు ఇంటర్మీడియట్ ఫస్టియర్ సిఈసి,హెచ్ఈసి లలో ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు హాస్టల్ వసతి లభించును. ఈ అవకాశాన్ని మైనార్టీ విద్యార్థులతో పాటు వారి వారి రిజర్వేషన్ల ప్రకారం వున్నా అన్ని మతాల వారికి అవకాశం ఉన్నందున ఆన్లైన్లో https://tgmreistelangana.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోగలరు. మరింత సమాచారం కొరకు 7995057876, 9618142493,9177362524,9959113694 ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
.
Aksharam Telugu Daily