AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : మేడ్చల్ అక్షరం ప్రతినిధి సంక్షేమ హాస్టల్లో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించాలని వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని *సంక్షేమ హాస్టళ్లలో వెంటనే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని* *యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్* డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, "వర్షాకాలంలో దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, జలుబు, జ్వరం వంటి అంటువ్యాధులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లలో వసతులు సరిగా లేకపోవడం, పరిశుభ్రత లోపించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు" అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి హాస్టల్‌లో వైద్య బృందాలతో ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ చేయాలని కోరారు. హాస్టళ్లలో శానిటైజేషన్, ఫాగింగ్, తాగునీటి పరీక్షలు* కూడా నిర్వహించాలని సూచించారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము" అని *ఎం. చంద్రకాంత్* హెచ్చరించారు. ఇప్పటికే పలు హాస్టళ్ల నుండి విద్యార్థులు జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
.
Aksharam Telugu Daily