Friday, 21 August 2026 10:29:42 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఉద్యోగుల ఐక్యతకు టీఎన్‌జీవోస్‌ జెండా ప్రతీక, బొంకూరి శంకర్‌

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 21 August 2026 05:59 PM Views : 14

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 21 అక్షరం న్యూస్ ఉద్యోగుల ఐక్యతకు టీఎన్‌జీవోస్‌ జెండా ప్రతీకగా నిలుస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ అన్నగారి పిలుపు మేరకు శుక్రవారం పెద్దపల్లి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భవనంలో టీఎన్‌జీవోస్‌ అధికారిక జెండా, కండువా, ‘ఉద్యోగ గొంతుక’ మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ‘ఉద్యోగ గొంతుక’ మాసపత్రిక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వేదికగా నిలుస్తుందని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అయిరెడ్డి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న మహాధర్నా, సెప్టెంబర్‌ 1న చేపట్టనున్న పెన్షన్‌ విద్రోహ దినం నిరసన, సెప్టెంబర్‌ 10న నిర్వహించే చలో హైదరాబాద్‌ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపు అనిత, కొమురయ్య, ఆడెపు శ్రీనివాస్‌, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, సౌమ్య, స్వప్న, అడ్ల పురుషోత్తంరెడ్డి, నూకల శంకర్‌, జగన్‌, సరిత, నాయిని భాగ్యమ్మ, రాజీరెడ్డి, సందీప్‌రావు, రాజప్రసాద్‌, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :